పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 14-08-2025
నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి - శ్రీదేవి చౌదరి దంపతుల కుమార్తె అఖిల రాజ్ నిశ్చితార్థ వేడుక కార్యక్రమం కావలి పట్టణంలోని గాయత్రీ నగర్ ఎస్ఎంకే కళ్యాణ మండపంలో గురువారం జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, బీద మస్తాన్ రావు గారు, పలువురు ఎమ్మెల్యే లు, అధికారులు పాల్గొన్నారు.. కావలి పట్టణం ఏఏ స్ట్రీట్ కు చెందిన బిల్లా నరసింహారావు - బాల కోటమ్మ దంపతుల కుమారుడు నవీన్ వివాహం టిటిడి కళ్యాణ మండపంలో గురువారం జరిగింది.
ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. దగదర్తి మండలం కట్టుబడిపాలెంకు చెందిన నర్సింగు శ్రీనివాసులు - లక్ష్మీ దంపతుల కుమార్తె దీప్తి వివాహం నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, దగదర్తి మండల టీడీపీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, జలదంకి శ్రీహరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు..