పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 09-08-2025

 పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయితీ కుమ్మరిపాలెంలో జరిగిన పోలేరమ్మ గుడి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. గ్రామంలోని స్మశానానికి దారి, గ్రామంలోని ప్రతి రోడ్డును సీసీ రోడ్డుగా మార్చడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆలయం త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులను కోరారు. కావలి పట్టణం 31వ వార్డు టిడిపి సీనియర్ నాయకులు దామా మాల్యాద్రి కుమార్తె మంజూష నిశ్చితార్థ కార్యక్రమం కావలి వైకుంఠపురంలో వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. కావలి పట్టణం ముసునూరు బాలాజీ నగర్ కు చెందిన సింగమనేని శ్రీనివాసులు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని గృహ యజమానులను ఆశీర్వదించారు. సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

కావలి రూరల్ మండలం బైనేటి వారి పాలెం కు చెందిన పరుసు శ్రీహరి - రమణమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ వివాహం బైనేటివారి పాలెంలోని వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

google+

linkedin