కావలిలో అట్టహాసంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారబించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు

కావలిలో అట్టహాసంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారబించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.

మహిళలతో ఉచిత బస్సులో కావలి నుంచి తుమ్మలపెంట గ్రామం వరకు ప్రయాణం చేసిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి

ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసింది.ఎమ్మెల్యే

కావలి డిపో పరిధిలో 5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు.

అందులో మహిళలు 40 శాతం ప్రయాణం చేస్తారు,వారి అందరికి ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయవచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన స్రి శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కావలి ఆర్టీసీ బస్టాండ్ నందు స్థానిక శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి జండా ఊపి ప్రారంభించారు. మహిళలతో ఉచిత బస్సులో కావలి నుంచి తుమ్మలపెంట గ్రామం వరకు ప్రయాణం చేసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు.రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమపాళ్లలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు.

ప్రతిపక్షాలు సూపర్ సిక్స్ పథకాలపై  హేళన చేస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ  ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ  ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో  రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని  ఎమ్మెల్యే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts