కావలి కనక పట్టణంగా మారుతుంది
కేంద్ర ప్రభుత్వ నిధులు 17 కోట్లతో చేపట్టనున్న కావలి ట్రంకు రోడ్డు విస్తరణకు శంకుస్థాపన
శంకుస్థాపన చేసిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి
కావలి పట్టణంలో అద్భుతమైన ప్రగతి జరుగుతోంది
కావలి ప్రాంతం కనకపట్టణంగా మారుతోందని, అనేక కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా సాగుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. కావలి పట్టణంలోని NH- 167BG లో భాగంగాట్రంక్ రోడ్డు విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.17 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారితో కలిసి ఎంపీ వేమిరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కావలి పట్టణం చాలా అభివృధి చెందుతోందని, అభివృద్ధికి సమాంతరంగా రహదారులు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కావలి టౌన్ లో ట్రాఫిక్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.. సమస్యను తన దృష్టికి తెచ్చిన వెంటనే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి నిధులు కోరామన్నారు. అడిగిన వెంటనే ఆయన స్పందించి 17.06 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోడనీ, కావలి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కోట్ల రూపాయల అభివృధి పనులు ప్రారంభించారని చెప్పారు. కావలి పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, టిడిపి నేతలు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కావలి నియోజకవర్గ జనసేన ఇంచార్జి అలహరి సుధాకర్, జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.