పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 07-08-2025

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి పట్టణం లోని మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ పై నూతనంగా ఏర్పాటు చేసిన రాయలసీమ రుచులు హోటల్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం ప్రారంభించారు..

హోటల్ యాజమాన్యం ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. భోజన ప్రియులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్నిఅందించి ఆందరి ఆధరాభిమానాలు చూరగొనాలని హోటల్ యాజమాన్యాన్ని కోరారు. కావలి పట్టణం కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన గొట్టిపాటి నరసింహ ప్రసాద్ నాయుడు సోదరుడు ఉమా మహేశ్వర నాయుడు వివాహ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

కావలి పట్టణానికి చెందిన పేపాల రోశయ్య కుమార్తె నిహారిక నిశ్చితార్ధ కార్యక్రమం హోటల్ ఎస్ఆర్ పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కావలి పట్టణం శాంతి నగర్ కు చెందిన పత్తిపాటి సుబ్రహ్మణ్యం- రమాదేవి దంపతుల కుమారుడు సతీష్ కుమార్ వివాహ గంధపు నలుగు కార్యక్రమం జమ్మలపాలెంలోని ఎస్ విఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin