అంతిమ యాత్రలో జనాజా: డోరీ మోసిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం 10వ వార్డు కసాయివీధికి చెందిన ముస్లిం మత పెద్ద మౌలానా షేక్ గులాం రసూల్ అనారోగ్యంతో అకాల మరణం చెందారన్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు వారి భౌతిక ఖాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అంతిమ యాత్రలో జనాజా: డోరీ మోశారు. కసాయి వీధిలోని మసీదు వద్ద నుండి వైకుంఠపురంలోని స్మశానం వరకు వెంట వెళ్లి చివరి ఘట్టం పూర్తి అయ్యేవరకు ఉండి గులాం రసూల్ పై తనకున్న ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మందికి విద్యాబుద్దులు నేర్పిన వ్యక్తి రసూల్ అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని తెలిపారు. ఆయన బాటలో అందరూ నడవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు..