ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు సద్వినియోగం చేసుకోవాలి

 ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు సద్వినియోగం చేసుకోవాలి

కావలి పట్టణం 18వ వార్డులో వితంతు పెన్షన్ పంపిణీ కార్యక్రమం 

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.  శుక్రవారం కావలి పట్టణం 18వ వార్డు వెంగలరావు నగర్ లో ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు వితంతు పింఛన్లు అందజేశారు. అనంతరం పించనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్వాంగులు, వ్యాధిగ్రస్ధులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి అండగా నిలిచిందని అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని అయినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీలకు, కులాలకతీతంగా వృద్ధులకు, వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, తల సేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు, సంపూర్ణ వికలాంగులకు 15వేల రూపాయలు పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అధికారులు ప్రజాప్రతినిధులు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తు న్నారని అన్నారు. కావలి నియోజకవర్గం లో కొత్తగా 666 మందికి వితంతు పెన్షన్లు అందజేయడం జరిగిందన్నారు.

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు ఆర్ధికంగా అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత అంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు వితంతు పెన్షన్లు అందజేసి వారి కుటుంబాల్లో సంతోషాలు నింపారని అన్నారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిశ్చయించిందని తెలిపారు. పేద ప్రజలకు కొత్త కాలనీలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ కష్టపడుతుందని తెలిపారు. 666 మందికి పెన్షన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోమునిసిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, డిఈ సాయిరామ్, టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, శానం హరి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

google+

linkedin