సముద్రపు వేటలో యువకులు మృతి చెందడం బాధాకరం 10-08-2025

 సముద్రపు వేటలో యువకులు మృతి చెందడం బాధాకరం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

సముద్రపు వేటలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే స్థానిక ఏరియా వైద్యశాలకు వెళ్లి యువకుల మృతదేహాలను దర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదొక దురదృష్టకర సంఘటన అని అన్నారు. సముద్ర వేటకు వెళ్లిన ముగ్గురులో ఇద్దరు మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. బోటు లేకుండా వేటకు పోవడంతోనే ప్రమాదం జరిగి మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

google+

linkedin