వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరిక 15-08-2025
కావలి పట్టణానికి చెందిన పలువురు వైసిపి ముఖ్య నాయకులు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రముఖ రియల్టర్ జనిగర్ల మహేంద్ర యాదవ్, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ తోట శ్రీహరి, 3వ వార్డు మాజీ కౌన్సిలర్ సమాధి రవి, పల్లపు కొండలు, కస్య మల్లికార్జున, మామిడాల మధుమోహన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కావలి మున్సిపాలిటీలో 40 కి 40 వార్డు స్థానాలు గెలిచి కావలి మున్సిపాలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి బహుమతిగా ఇచ్చే విధంగా కృషి చేద్దామని వారికి తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే వారికి తెలిపారు.