ప్రమాణ స్వీకారం చేసిన పిఏసిఎస్ చైర్మన్ 05-09-2025

 ప్రమాణ స్వీకారం చేసిన పిఏసిఎస్ చైర్మన్ - ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

కావలి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఏసిఎస్) చైర్మన్ గా కాటా భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు గా సోమయ్యగారి రమణ, కమతం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. కావలి శివాలయం పక్కన గల కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామని చైర్మన్, డైరెక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పార్టీ కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ వెన్నంటి ఉండిన ప్రతి ఒక్కరికీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సోసైటీ ద్వారా అందే ఋణలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, కండ్లగుంట మధుబాబు నాయుడు, పోట్లూరు శ్రీనివాసులు, దగుమాటి మాల్యాద్రి రెడ్డి, జలదంకి మండల టిడిపి అధ్యక్షులు మధుమోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మస్తాన్, చిలకపాటి శ్రీనివాసులు, జనిగర్ల మహేంద్ర యాదవ్, పలు సొసైటీల ప్రెసిడెంట్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

google+

linkedin

Popular Posts