మహిళలకు అండగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే
- కావలి పట్టణంలో వైభవంగా స్త్రీ శక్తి కార్యక్రమం
- కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
మహిళలకు అండగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలో బుధవారం నిర్వహించిన స్త్రీ శక్తి కార్యక్రమం విజయవంతమైంది. వేలాదిగా మహిళలు పాల్గొని ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొదటగా, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి సెల్ఫీ పాయింట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అక్కడి నుండి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ స్త్రీలు సృష్టికి మూలమన్నారు. ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇంటి వాతావరణం సుఖశాంతులతో నిండి ఉంటుందని, అందుకే తల్లిని శాస్త్రం ఆరు చేతులు కలిగిన శక్తిగా వర్ణించిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావు నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని గుర్తుచేశారు.
1988లో మహిళలకు ఆస్తులపై హక్కులు కల్పించడంలో ఎన్టీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, అనంతరం చంద్రబాబు నాయుడు హోదాలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన వివరించారు. గ్యాస్ సిలిండర్లు, స్టౌలు అందజేసిన తొలి ప్రభుత్వం టిడిపీ అని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, భూమి హక్కులు మహిళల పేరుమీదే ఇచ్చే విధానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు.
డాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలకు పొదుపు అలవాటు, రుణాల సౌకర్యం కల్పించబడిందని తెలిపారు. భవిష్యత్తులో వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల వరకు అందించే పథకం అమలులోకి వస్తుందని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో ఉన్నారని వెల్లడించారు. అదేవిధంగా, విద్యార్థుల చదువుల కోసం ప్రతి పిల్లవాడికి రూ.13,000 రూపాయల ఆర్థిక సాయం, యూనిఫాంలు, షూ, పుస్తకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు.
మహిళలు ఓటు శక్తితో సమాజంలో మార్పు తేవగలరని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి చెప్పారు. నాకు మీరు ఇచ్చిన మద్దతు, ప్రేమ, ఆశీస్సులతో కావలి అభివృద్ధికి నేను మీ ఇంటి బిడ్డగా ఎల్లప్పుడూ కాపాడుతానని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి మాట్లాడుతూ కావలిని కాపు కాసే నాయకుడు మనకు దొరకటం అదృష్టమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గురించి గొప్పగా వివరించింది.
ఇలాంటి ఎమ్మెల్యేలు కావలికి పరిచయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ధన్యవాదాలు తెలిపింది. చంద్రబాబు గారు మహిళలకు అందిస్తున్న పథకాలను సందర్భంగా వివరించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..