పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 20-10-2025

 పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 

కావలి పట్టణం 40 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆన్సర్ మనవడి అకికా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.. 

అలాగే పెట్లూరి గోపాల కిష్టయ్య వీధి బడిలో 70 సంవత్సరాల క్రితం ఒకటవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం కావలి పట్టణంలోని సాయి బాబా గుడి ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. 70 సంవత్సరాల క్రితం చదువుకొని, ఇప్పటికీ సన్నిహితంగా ఉండటం గర్వకారణం అన్నారు.. నేటి యువతకు మీరు స్ఫూర్తి అని వారిని కొనియాడారు. ముందుగా సాయిబాబా ను దర్శించుకొని, బాబా ఆశీస్సులు ఎమ్మెల్యే అందుకున్నారు..

google+

linkedin

Popular Posts