57 మంది కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన కావలి ఎమ్మెల్యే..

 57 మంది కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన కావలి ఎమ్మెల్యే..

వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న  కావలి నియోజకవర్గం లోని 696 మంది కి ఇప్పటి వరకు రూ. 6,17,48,841 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు రూ. 37,22,710 చెక్కులు అందజేశారు. రాష్ట్రంలోనే  సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో  కావలి ప్రథమన్నారు. వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు. మొత్తం 1000 అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటివరకు 696 మందికి ఇచ్చామన్నారు.

మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కావలి నియోజకవర్గంలోని  అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తున్నారు.రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు కంటే ఎక్కువ పధకాలు ఇస్తున్నారన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో ప్రథమ స్థానంలో ఉందన్నారు..

google+

linkedin

Popular Posts