ముందర పొట్టెమ్మ తల్లిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే

 ముందర పొట్టెమ్మ తల్లిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే 

కావలి రూరల్ మండలం అన్నగారిపాలెంలోని శ్రీశ్రీశ్రీ ముందర పొట్టెమ్మ తల్లి దేవతా సహిత శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆదివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ముందర పొట్టెమ్మ ను, గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు..


google+

linkedin

Popular Posts