దగదర్తి మండలంలో టిడిపి కుటుంబాలను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే 18-11-2025

దగదర్తి మండలంలో టిడిపి కుటుంబాలను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి. ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కలుసుకుని వారి కుటుంబ సభ్యుల  పరిస్థితులను తెలుసుకున్నారు.

దగదర్తి మండలం ఐతంపాడు కొత్తూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అలవల రత్నమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

అదేవిధంగా, దగదర్తి మండలం మనుబోలుపాడుకు వెళ్లిన ఎమ్మెల్యే, ఇటీవల మృతి చెందిన టిడిపి నాయకుడు దగుమాటి నాగరాజు రెడ్డి తల్లి దగుమాటి హాజరత్తమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. బాధలో ఉన్న కుటుంబ సభ్యులను సాంత్వనపరిచారు.

తరువాత కామినేని వారి పాలెంను సందర్శించిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి, టిడిపి నాయకుడు వంకదారి రత్నం తమ్ముడు వంకదారి వేణు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని దర్శించి సానుభూతి ప్రకటించారు.

టిడిపి కార్యకర్తల కుటుంబాలు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నా వారి పక్కనే ఉంటామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఈ సందర్భం గా తెలిపారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండలం  టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts