పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 25-11-2025
దగదర్తి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన మిరియాల మురళి - మంజుల దంపతుల కుమారుడు మణి వివాహ రిసెప్షన్ కార్యక్రమం ధర్మవరంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన దగదర్తి మండలం మనుబోలుపాడుకు చెందిన దవనం వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, జలదంకి శ్రీహరి నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..





