అల్లూరు మండలం సింగపేట వద్ద బొలెరో వాహనం తిరగబడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెంది మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడం పట్ల కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుటాహుటిన అల్లూరు లోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. మార్చురి లోని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తీవ్రంగా గాయపడి నెల్లూరు లోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయా హాస్పిటల్ డాక్టర్స్ కు ఫోన్ లో సూచించారు.. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Home
- KAVALI MLA
- అల్లూరు మండలం సింగపేట వద్ద బొలెరో వాహనం తిరగబడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెంది మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడం పట్ల కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు








