శ్రీ ఆంజనేయ స్వామి వారి ధర్మధ్వజాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు..

 శ్రీ ఆంజనేయ స్వామి వారి ధర్మధ్వజాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు..

కావలి రూరల్ మండలం రుద్రకోటలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో  ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారిని ట్రస్టు సభ్యులు, అర్చకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించి, కావలి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే గారిని ఘన సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

స్వామి వారి భక్తుడు మూలంరెడ్డి కామేశ్వర్ రెడ్డి విరాళంతో ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ధర్మధ్వజమును ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు...

కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు ట్రస్ట్ సభ్యులు, నాయకులు, గ్రామస్థులతో కలిసి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం నూతన గోశాల నిర్మాణ పనులను పరిశీలించి, అవసరమైన మార్గనిర్దేశం చేశారు.

ఆలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పలు సూచనలు చేస్తూ, అభివృద్ధి పనులకు కావాల్సిన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ— ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయలు విరాళం అందించారని, ఆ నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే గారికి ట్రస్టు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు,భక్తులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts