నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 25న ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాలో 14 కంపెనీలు పాల్గొంటున్నాయని, 830 మందికి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బీ.టెక్, బీ. ఫార్మసీ, పీజీ ఇలా అన్ని అర్హతలకు సంబందించిన ఉద్యోగాలు ఈ జాబ్ మేళా లో ఉన్నాయని తెలిపారు.

18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి నెలకు కనీసం రూ.12,000 నుండి గరిష్ఠంగా రూ.25,000 వరకు జీతం లభిస్తుందన్నారు. కొన్ని కంపెనీలలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా ఉన్నదని అన్నారు. కంపెనీ లొకేషన్ ను బట్టి పని చేయవలసి ఉంటుందని, నెల్లూరు, నాయడుపేట, ముత్తుకూరు సెజ్, శ్రీ సిటీ సెజ్, హైదరాబాద్, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం చేయవలసి ఉంటుందని అన్నారు. కావలి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు..



google+

linkedin

Popular Posts