పులి యర్రయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
మృతుని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే
దగదర్తి మండలం చవటపుత్తేడు గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు, తలమంచి మేజర్ కెనాల్ డిస్టిబూటర్ చైర్మన్ పులి శీనయ్య తండ్రి పులి యర్రయ్య మరణించారు. విషయం తెలిసిన వెంటనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆదివారం గ్రామానికి చేరుకున్నారు.
యర్రయ్య గారి భౌతిక కాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి,ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే గారితో పాటు దగదర్తి మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని యర్రయ్య గారికి నివాళులు అర్పించారు. యర్రయ్య మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






