విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం... కుటుంబాన్ని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం... కుటుంబాన్ని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట హరిజనవాడ గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. అదే గ్రామానికి చెందిన ఉదయగిరి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే — ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కొద్దిసేపట్లోనే మొత్తం ఇల్లు మంటల్లో చిక్కుకుంది. ఇంట్లో ఉన్న బీరువాలు, నగదు, గృహోపకరణాలు, తినుబండారాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది.

ఈ సంఘటన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఎమ్మెల్యే గారు అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి దగ్ధమైన ఇంటిని పరిశీలించి, జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ —

ఇలాంటి దురదృష్టకర ఘటనలో కుటుంబానికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి, సహాయం అందించేలా చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది, అని భరోసా ఇచ్చారు.

గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారి స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

google+

linkedin

Popular Posts