కావలి మండల ఆర్యవైశ్య సంఘం కార్తీక మన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 16-11-2025

 కావలి మండల ఆర్యవైశ్య సంఘం కార్తీక మన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి…

ఎమ్మెల్యే,బాల స్వామీజీ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు..

 భారీగా పాల్గొన్న ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు..

నెల్లూరు జిల్లా,కావలి పరిధిలోని ముంగమూరు వనమిత్రలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది...ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఆర్యవైశ్య నాయకులు ఘన స్వాగతం పలికారు...

ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొనగా, పెనుగొండ పీఠాధిపతి బాల స్వామీజీ చేతుల మీదుగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు, నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు..కావలి నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నాను..పెనుగొండ పీఠాధిపతి బాల స్వామీజీ పాల్గొని శివ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.విశిష్టమైన వేద మంత్రోచ్ఛారణల మధ్య శివలింగాభిషేకం, దీపారాధన కార్యక్రమాలు సాగి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి.భక్తులతో కలిసి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు..

అనంతరం అధికారులతో కలిసి కార్తీక మాసం సందర్భంగా వనమిత్రలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సభలో ఉన్న వారిని అలరించాయి.కార్యక్రమం మొత్తం కుటుంబమంతా కలిసి పాల్గొనేలా, ఆధ్యాత్మికత–వినోదం కలగలిసిన వాతావరణం నెలకొంది.. ఆర్యవైశ్యుల కార్తీక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మరియు వారి బృందాన్ని ఎమ్మెల్యే గారు  అభినందించారు.ఆర్యవైశ్యులకు  విధాలుగా అడ్డగా ఉంటానని హామీ ఇచ్చారు..కార్యక్రమం మొత్తం ప్రశాంతంగా,భక్తి వాతావరణంలో, భారీ జనసందడి మధ్య విజయవంతంగా ముగిసింది.వనమిత్ర ప్రాంగణం కార్తీక మాసానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణంతో సందడి చేసింది. వేలాదిమంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, పెద్దలు, మహిళలు, చిన్నారులు మహోత్సవానికి భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

google+

linkedin

Popular Posts