కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధాన మార్కెట్ యార్డు — మద్దూరుపాడు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటుచేసిన పాలకవర్గ సభ్యుల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే చేతుల మీద ఆవిష్కరించారు. అనంతరం కమిటీ ఛైర్‌పర్సన్ పోతుగంటి అలేఖ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.

సమావేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

సమీక్షా సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

🔸 రైతు బజార్ అభివృద్ధికి రూ. 55 లక్షల ప్రతిపాదన

రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు అందించేందుకు రైతు బజార్ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

🔸 కార్యాలయం & గోదాముల నిర్వహణకు రూ. 96 లక్షలు

వ్యవసాయ పంటల నిల్వ, నిర్వహణ, కార్యకలాపాల బలోపేతం కోసం నూతన గోదాముల అభివృద్ధి, మరమ్మతులు, మార్కెట్ కార్యాలయం సౌకర్యాల కోసం నిధుల ప్రతిపాదనలు గుంటూరు మార్కెటింగ్ సంచాలకులకు పంపేందుకు ఆమోదం తెలిపారు. కావలి నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల కోసం రూ. 1135 లక్షలు

పంటలు, ఉత్పత్తుల రవాణాకు సౌకర్యంగా ఉండే విధంగా గ్రామాల్లో పగడ్బందీ రోడ్లు వేసేందుకు భారీ మొత్తంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

సమావేశంలో మద్దూరుపాడు ప్రధాన యార్డులో క్రింది సదుపాయాల ఏర్పాటుపై చర్చ జరిగింది:వ్యవసాయ పంటల పరిశీలన (ఫుడ్ గ్రేడ్) ల్యాబ్,నీటి నాణ్యత పరీక్షా కేంద్రం,గ్రామాల్లో పశువుల బోనుల నిర్మాణం..ఈ ప్రతిపాదనలు సంబంధిత అధికారులకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు...ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ పరిధిలో సాగుతున్న పనులు, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, రాబోయే కొనుగోలు సీజన్‌లో తీసుకోవాల్సిన ఏర్పాట్లు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రైతులకు వేగవంతమైన సేవలు అందించడం, మార్కెట్ అభివృద్ధికి కావాల్సిన బడ్జెట్, మౌలిక వసతుల పురోగతి వంటి విషయాలను సవివరంగా సమీక్షించారు..ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, పార్టీ నాయకులు..మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts