మరో తిరుమలగా కొండ బిట్రగుంట.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
బోగోలు మండలం కొండ బిట్రగుంట మరో తిరుమలగా విలసిల్లాలని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. గురువారం అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులతో కలిసి కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలో జరుగుతున్న మహా ప్రాకారం నిర్మాణం,కోనేరు అభివృద్ధి పనులు పరిశీలించారు.. ఆలయ అభివృద్ధి ప్రణాళికలను ఇంజనీర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు.ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం దాతల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు..



















