పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 23-11-2025

 పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 23-11-2025

కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆదివారం కావలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యారు. వ్యాపార ప్రారంభోత్సవాలు, వివాహ వేడుకలు, పుట్టినరోజు వేడుక వంటి అనేక కార్యక్రమాలకు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.

కావలి పట్టణంలోని రూపాయి మిద్దె సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఉదయ్స్ కాఫీ బార్ ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.20వ వార్డు టిడిపి నాయకులు ఎర్రంశెట్టి గోపి కుమారుడు ఉదయ్ కుమార్‌ను అభినందించిన ఎమ్మెల్యే గారు, పట్టణ ప్రజలకు నాణ్యమైన కాఫీ సేవలను అందించాలని సూచించారు.ప్రారంభోత్సవం అనంతరం పార్టీ నాయకులతో కాసేపు టీ తాగుతూ సత్సంగం సాగించారు...కావలి గురురాఘవేంద్ర కాలనీ మసీదు ఎదరుగా నూతనంగా ఏర్పాటు చేసిన MDR చికెన్ సెంటర్ ను కూడ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రారంభించారు.షాపు యజమాని మల్లికార్జునకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే గారు, నాణ్యమైన చికెన్ అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.

ప్రారంభోత్సవంలో స్థానికులు, వ్యాపారవేత్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు...అల్లూరు మండలం గ్రద్దగుంట గ్రామానికి చెందిన యనమల శ్రీహరి యాదవ్ (మాజీ సర్పంచ్), శ్రీమతి సునీత గార్ల కుమారుడు కిషన్ వివాహం నెల్లూరులోని శ్రీ కస్తూరి దేవి గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్యం సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.దేశిరెడ్డి భాస్కర్ రెడ్డి – శ్రీమతి విజేత గార్ల కుమారుడు నిఖిల్ రెడ్డి వివాహం శనివారం VPR కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వధూవరులను ఆశీర్వదించారు...ఆముదాలదిన్నె టీడీపీ సీనియర్ నేత ఉప్పాల శ్రీనివాసులు గౌడ్ – శ్రీమతి గీత గార్ల కుమారుడు విష్ణు చైతన్య వివాహం శనివారం RSR కళ్యాణ మండపంలో జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు...కావలి రూరల్ SI చిత్తతూరి తిరుమలరెడ్డి – శ్రీమతి సుజాత గార్ల కుమార్తె లలిత వివాహం SMK కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగింది.ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు హాజరై వధూవరులను ఆశీర్వదించారు..కావలి రూరల్ చెంచుగాని పాలెం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నేత పోసిన శ్రీనివాసులు – శ్రీమతి ధనలక్ష్మి గార్ల మనవరాలు స్వేచ్ఛ శ్రీ పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చిన్నారిని ఆశీర్వదించి, ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు అభివృద్ధిని కోరుకున్నారు...ఏలూరు వెంకట కృష్ణయ్య – హజరత్ అమ్మ గార్ల కుమారుడు రఘువరన్ వివాహం ఆదివారం కావలి నారాయణ కళ్యాణ మండపంలో జరిగింది.ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts