నెల్లూరులో మంత్రి నారాయణ సమీక్ష — ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్, లేఅవుట్లపై కీలక చర్చ.. సమీక్ష సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు .
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేషన్, నుడా అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ (బీపీఎస్) దరఖాస్తుల పరిశీలన, లేఅవుట్ల అప్రూవల్స్, నగర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు మంత్రి గారు ఆరా తీశారు. సంబంధిత ఫైళ్లను, ప్రస్తుత స్థితిని అధికారులు మంత్రి గారికి సమర్పించారు.
జనవరి నుండి నుడా ఆదాయం–వ్యయాల వివరాలను నుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు మంత్రి గారికి సమగ్రంగా వివరించారు. కావలి, కందుకూరులో ఎంఐజీ లేఅవుట్ల ద్వారా వచ్చిన ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలపై కూడా సమావేశంలో చర్చలు సాగాయి.
సమీక్ష అనంతరం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ—
“మంత్రి నారాయణ గారి సూచనలతో ముందుకు వెళుతున్నాం.”
“ప్రజా ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుంది.”
“ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ ద్వారా మధ్యతరగతి ప్రజలకు గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.”
“అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.”
“అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తోంది.”
“కావలి వాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించి నగర అభివృద్ధికి సహకరించాలి.”
నగరాభివృద్ధి, నిర్మాణ నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.








