కావలి పట్టణంలో డిసెంబర్ 3న ఫిజియోథెరపీ కాలేజీ తొలి గ్రాడ్యుయేషన్ డే
కావలి పట్టణంలోని శ్రీ లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిజియోథెరపీ కాలేజీలో డిసెంబర్ 3న జరగనున్న ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేయవలసిందిగా కాలేజీ యాజమాన్యం మరియు విద్యార్థులు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కాలేజీ ప్రతినిధులు ఎమ్మెల్యే గారికి ఆహ్వాన పత్రాన్ని అందజేసి, విద్యార్థుల తొలి పట్టాభిషేక వేడుకలో పాల్గొనవలసిందిగా కోరారు. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు కాలేజీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

