సంగం బ్యారేజి నుండి కావలి కాలువకు సాగునీటిని విడుదల చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 18-11-2025

సంగం బ్యారేజ్‌ నుండి కావలి కాలువకు సాగునీటి విడుదల చేసిన కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. 

రైతుల పొలాలన్నీ సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ ధ్యేయం -కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

కావలి కాలువలోకి సాగునీరు ప్రవహించింది—రైతుల ఆశలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం 

ప్రతి నీటి బొట్టు రైతు వరకు చేరేలా సమన్వయం -ఎమ్మెల్యే దగుమాటి హామీ..

అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయకత్వంలో రామరాజ్య పాలన -ఎమ్మెల్యే ప్రశంసలు

సోమశిల రెండో కారు ప్రారంభం -కూటమి ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

అన్నదాత సుఖీభవలో పెద్దమొత్తం విడుదల -కావలి రైతులకు 12 కోట్లు రేపే జమ..

నెల్లూరు జిల్లా,సంగం బ్యారేజ్‌ వద్ద సోమవారం సాగునీటి విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కావలి కాలువకు నీటిని విడుదల చేస్తూ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలువ రెగ్యులేటర్ వద్ద రైతుల సమక్షంలో సాగునీటిని కాలువలోకి ప్రవహింపజేశారు.ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి, సోమశిల ఎస్ఈ రమణారెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు చేరి సాగునీటి విడుదలను సంతోషంతో స్వాగతించారు.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, యువనేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గార్లు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడి అన్ని ప్రాజెక్టులు, చెరువులలో పుష్కలంగా నీరు నిండిపోయి నిండుకుండలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పుష్కల వర్షాల వరదతో ఎన్నడూ లేని విధంగా రెండవ కారు పంటకు నీరు విడుదల చేయడం రైతులకు ఎంతో ఆశాజనకమని, ఇది వ్యవసాయ రంగానికి పునర్జీవం నింపే నిర్ణయమని తెలిపారు. కావలి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు చేరేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.

“రైతుల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు మన సీఎం చంద్రబాబు”

రాష్ట్రంలో రైతుల అభ్యున్నతే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో సాగుతున్న చర్యల వల్లే ఈరోజు జిల్లా మొత్తం తిరిగి అభివృద్ధి మార్గంలో నడుస్తోందని తెలిపారు.అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు పాలన రామరాజ్యాన్ని తలపించేలా ఉందన్నారు.

సోమశిల ప్రాజెక్ట్ చరిత్రలో అరుదైన ఘనత..

సోమశిల ప్రాజెక్ట్ చరిత్రలో ఇంత త్వరగా రెండో కారుకు నీరు ఇవ్వడం అరుదైన విషయమని, ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ కృషి ఫలితమని చెప్పారు. రైతులకు నీటి కొరత రాకుండా నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా మంత్రులు, అధికారులు సమన్వయం చేసుకుంటున్నారని వెల్లడించారు.

ఎరువుల కొరత లేకుండా చర్యలు.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 

జిల్లాలో ఎరువుల కొరత ఏ రైతు కూడా అనుభవించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పంటలు వేసుకునే సమయాల్లో రైతులకు కావలసిన అన్ని వనరులు అందేలా మంత్రులు తగిన చర్యలు చేపడుతున్నారని చెప్పారు.

రేపే రైతుల ఖాతాల్లోకి 12 కోట్లు..

కావలి నియోజకవర్గంలోని మొత్తం 19,000 మంది రైతుల ఖాతాల్లోకి 12 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు రేపు జమ కానున్నాయని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ నిధులు పంటలపై రైతుల భారాన్ని తగ్గించేందుకు పెద్ద సహాయంగా ఉంటాయని తెలిపారు.

“రైతుల పక్షాన నేనున్నా… నీటి ప్రతి బొట్టు సద్వినియోగం చేసుకోండి”

రైతులు ధైర్యంగా పంటలు వేసుకోవాలని, అందిస్తున్న నీటిని ప్రతీ బొట్టును వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం కోసం తోడ్పడతానని హామీ ఇచ్చారు.

కావలి నియోజకవర్గ అభివృద్ధిలో రైతులే ప్రధాన బలం అని, వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో..
అధికారులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,రైతులు తదితరులు భారీగా పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts