కావలి రైతులు సంతోషంగా ఉన్నారు... - కావలి MLA

 కావలి రైతులు సంతోషంగా ఉన్నారు...

తుఫాన్ ప్రభావంతో వచ్చిన వరదలను ఎదుర్కొన్న అధికారులకు అభినందనలు...

పకృతి వైపు ఎదురు చూడాల్సిన అవసరం లేదు,

రైతుల సంతోషంగా పంటలు పండించుకోవచ్చు..

ఇరిగేషన్ అధికారులతో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సమీక్ష సమావేశం..

వరుణ దేవుడి కరుణతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంతో - కావలి సస్యశ్యామలంగా మారుతోంది!” — ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

తుఫాన్ ప్రభావంతో వచ్చిన వరదలకు కావలి నియోజకవర్గం లో అన్ని చెరువులకు కూడా పుష్కలంగా నీరు రావడంతో కావలి రైతులు సంతోషంగా ఉన్నారని, వరదల ప్రభావం వల్ల ఇలాంటి ప్రమాదం లేకుండా ఎదుర్కొన్న అధికారులకు అభినందనలని  కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు అన్నారు.శనివారం ఆయన టిడిపి కార్యాలయంలో ఇరిగేషన్, సోమశిల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కావలి నియోజక వర్గంలో అత్యధిక వర్షపాతం పడటంతో ఇరిగేషన్ సంబంధించిన చానల్స్,బ్రిడ్జిలు, చెరువులు మరియు డ్రైవ్స్ దెబ్బతిన్నాయి దానికి కారణంగా నీటి సంఘాల అధ్యక్షులు,చెరువు అధ్యక్షులు,గ్రామస్తులతో మాట్లాడి దెబ్బతిన్న చెరువులు డ్రైనేజ్ కు సంబంధించి 316 పనులకు గాను 2832.26 లక్షలు  రూపాయలు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపడం జరిగింది అని అన్నారు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి రైతులు రెండు పంటలు పండించుకున్న తర్వాత కూడా మళ్లీ వర్షాలు పుష్కలంగా కురిసి చెరువులు నిండుకుండలా ఉండడంతో  మూడో పంట కూడా రైతులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ వరదల కారణంగా ప్రతి చెరువు దగ్గర ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉంటూ ముందస్తు చర్యలు తీసుకొని ఏ ఒక్క చెరువు కూడా తెగకుండా చూసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇరిగేషన్, సోమశిల, మరియు డ్రైనేను డిపార్ట్మెంట్ ఒక టీం గా ఏర్పడి సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు.ఇలాంటి అధికారులు, సిబ్బంది కావలి నియోజకవర్గం లో ఉన్నందుకు  ఎంతో సంతోషమన్నారు. అందరము కలిసి రైతులు సస్యశ్యామలంగా ఉండేందుకు  కృషి చేద్దామన్నారు.ఈరోజు కావలిలో త్రాగునీరు,సాగునీరు  పుష్కలంగా ఉండేందుకు కారణం వరుణ దేవుడైతే ఒకపక్క రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న శ్రీరాముని పాలనందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనత అన్నారు.ఇరిగేషన్ అధికారులే కాకుండా,విద్యుత్, పోలీస్, పారిశుద్ధ్య శాఖలు కూడా తుఫాను ఎదురుకునేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అలాంటి రైతు కష్టం తీరాలంటే పంటలు వేసుకునేందుకు పుష్కలంగా నీరు ఉండాలన్నారు. తుఫాన్ వరదల వల్ల ప్రతి రైతు కూడా ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, సోమశిల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts