మిత్రుడు బీద రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బీద రవిచంద్ర గారికి కావలి శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాదులో రవిచంద్ర గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు.జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రవిచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్ష పదవి లభించడం పట్ల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం ఇద్దరూ సుదీర్ఘంగా రెండు గంటలు సేపు పలు అంశాల మీద చర్చించుకున్నారు.



