ప్రసాద్ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

ప్రసాద్ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే..

నెల్లూరు జిల్లా,జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం గ్రామానికి చెందిన టిడిపి నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడు ఇటీవల కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు వారి పెద్దకర్మ కార్యక్రమం స్వగ్రామంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రసాద్ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను,బంధువులను పరామర్శించారు.

ప్రసాద్ నాయుడు మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొంటూ—“మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను… ఏ సహాయం అవసరమైనా వెంటనే చెప్పండి” అని ధైర్యం చెప్పారు.

గ్రామం మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయిన వేళ ఎమ్మేల్యే హాజరై కుటుంబానికి ఓదార్పుగా నిలిచింది..

google+

linkedin

Popular Posts