కోట శ్రీధర్ కుమార్తె వెంకట నిర్మయి ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

 కోట శ్రీధర్ కుమార్తె వెంకట నిర్మయి ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

కావలి పట్టణం 30వ వార్డ్ టీడీపీ నాయకుడు కోట శ్రీధర్ కుమార్తె వెంకట నిర్మయి పుష్పాలంకరణ మహోత్సవం ఆదివారం బృందావనం హౌసింగ్ కాలనీ కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించారు.కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

ఈ వేడుకకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరు కాలేకపోవడంతో, సోమవారం ప్రత్యేకంగా కోట శ్రీధర్ నివాసానికి ఎమ్మెల్యే గారు వెళ్లి వారి కుమార్తెను ఆశీర్వదించారు. మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యాలు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఎమ్మెల్యే గారిని కోట దంపతులు, ఆర్యవైశ్య ప్రముఖులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. శాలువా కప్పి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే స్నేహపూర్వకంగా మాట్లాడరు. ప్రజల పట్ల ఎమ్మెల్యేకి అనుబంధం మరియు ఆప్యాయతను మరొకసారి ప్రతిబింబించింది.

google+

linkedin

Popular Posts