శ్రీ శ్రీ శ్రీ నాగూరు మీరా స్వాముల గంధమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
జోరు వర్షం మధ్య భక్తులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే, “ముస్లిం సోదర సోదరీమణులకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను… దర్గా అభివృద్ధికి కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.
కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద శ్రీ శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వాముల గంధమహోత్సవం ఆదివారం రాత్రి భక్తిపూర్వకంగా, ఘనంగా నిర్వహించబడింది. జోరు వర్షం పడుతున్న ప్రాంతమంతా పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. వేలాది మంది హిందూ–ముస్లిం భక్తులు, కుటుంబాలతో కలిసి మహోత్సవానికి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక చైతన్యాన్ని తీసుకొచ్చారు.కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే గారిని దర్గా ప్రెసిడెంట్ ముస్తఫా,మరియు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పూల హారాలు అందజేసి, సంప్రదాయ పద్ధతిలో పూర్ణసత్కారం చేశారు.దర్గాలో ముస్లిం పెద్దలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక దువా నిర్వహించి, కావలి నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.జోరు వర్షం పడుతున్నప్పటికీ స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే,ముస్లిం సోదర సోదరీమణులపై తనకు ఉన్న అనుబంధాన్ని మరొసారి వెల్లడించారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ—“కావలి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని నాగూరు మీరా స్వామివారిని ప్రార్థిస్తున్నాను.ముస్లిం సోదర సోదరీమణులకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. దర్గా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను.”అని హామీ ఇచ్చారు.జెండా చెట్టు పరిసరాలు పూర్తిగా పండగ వాతావరణంలో మెరిశాయి..కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం సోదర సోదరీమణులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...






