టిడిపి యువ నేత గోచిపాతల సంజయ్ తల్లి స్నేహలత గారి మరణంపై సంతాపం తెలిపిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు
బోగోలు మండలం బేతనీపేట గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకుడు, బోగోలు మండలం ఐటీడీపీ అధ్యక్షులు గోచిపాతల సంజయ్ తల్లి గారు స్నేహలత అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకున్న, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పార్థివదేహం వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, స్నేహలత గారి సేవా భావం, కుటుంబపట్ల ఆమె చూపిన నిబద్ధతను స్మరించుకున్నారు. ఈ కష్టసమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
స్నేహలత గారి అకస్మాత్తు మరణం గ్రామంలో, కార్యకర్తల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు..






