కావలి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి.. తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి
కావలి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిని కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు మంత్రిని కోరారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండాలంటే కొత్త సబ్‌స్టేషన్ అత్యవసరమని వివరించారు.విద్యుత్ సరఫరాలో తరచూ జరుగుతున్న అంతరాయాల వల్ల గృహ వినియోగదారులు, వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే గారు వివరించారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి విద్యుత్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ అంశాలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తక్షణమే స్పందిస్తూ, కావలి నియోజకవర్గానికి సంబంధించిన విద్యుత్ సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకుంటామని, అవసరమైన ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.